Chiru-Puri Combination: మెగాస్టార్ ,పూరీజగన్నాధ్ కలయిక లో భారీ పాన్ ఇండియన్ మూవీ!

Posted by venditeravaartha, July 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ మరియు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ తన మొదటి సినిమా బద్రి తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పూరి ఆ తర్వాత రవితేజ గారితో చేసిన ఇడియట్,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి సూపర్ హిట్ ల తో టాప్ డైరెక్టర్ గా ఎదిగారు.ఇక మహేష్ బాబు గారి పోకిరి సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని చిరుత సినిమా తో పరిచయం చేసి సూపర్ హిట్ కొట్టారు ఇక గత కొంత కాలం గా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తనకి రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ తరువాత భారీ అంచల నడుమ రిలీజ్ అయినా లైగర్ తో భారీ డిజాస్టర్ ని చుసిన పూరి మరో సారి రామ్ తో చేసే డబల్ ఇస్మార్ట్ మీద ఆశతో ఉన్నారు.

purijagan
అయితే ఈ మధ్య రిలీజ్ అయినా మెగాస్టార్ చిరంజీవి గారి “గాడ్ ఫాదర్” సినిమా లో గెస్ట్ రోల్ చేసిన పూరి ఆ సినిమా కి సంబందిచిన ఒక వీడియో ఇంటర్వ్యూ లో మెగాస్టార్ గారు తనని తన కోసం రెడీ చేసిన ఆటో జానీ కథ అలానే ఉందా ? ఇప్పుడు మనం చేద్దాం అని అడిగిన ప్రశ్న కి
ఆ కథ ఎప్పుడో పక్కన పెట్టేసాను దాని బాబు లాంటి కథ ని మీకోసం రెడీ చేసి ఉంచాను మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సినిమా ని స్టార్ట్ చేద్దాం అని అన్నారు.అయితే ఆ సమయంలో పూరీ జగన్నాధ్‌కి “లైగర్” సినిమా నిరాశనే మిగిల్చింది. “లైగర్” పరాజయం కారణంగా, చాలా మంది హీరోలు పూరీతో కలిసి పనిచేయడానికి వెనుకాడారు.

auto johny

పూరి జగన్నాధ్ కథకు ఇంప్రెస్ అయిన చిరంజీవి తన ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే పూరి ఇప్పటికే రామ్ పోతినేనితో డబుల్ స్మార్ట్ మూవీకి స్క్రిప్ట్‌ను ఖరారు చేశారు. రామ్ సినిమా పూర్తి కాగానే ఆ ప్రాజెక్ట్‌తో ముందుకెళ్తానని చిరంజీవి ప్రకటించారు.చిరంజీవి కూడా వశిష్ట మల్లిడి, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పూరీ జగన్నాధ్ “లైగర్” సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోవడం వల్ల ముందుగా పూరీ మరో సినిమా తీయాలని చిరంజీవి సూచించాడట.రామ్ సినిమా తర్వాత పక్కాగా మెగాస్టార్ తో స్టార్ట్ చేసే సినిమా ని పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నట్లు సమాచారం.

chiru puri

2007 views