Chiranjeevi : రజినీకాంత్ దర్శకత్వం లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా అదేనా..?

Posted by venditeravaartha, March 8, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Chiranjeevi : తెలుగులోనూ మరియు తమిళంలో నటించే హీరోలకు స్నేహ సంబంధం ఎప్పుడూ ఉంటుంది. రజనీకాంత్ గారు తమిళంలో సూపర్ స్టార్ అయిన సినిమా రంగంలో వచ్చినప్పటినుండి తమిళ అభిమానులతో పాటు తెలుగు అడియన్స్ మనసుని కూడా గెలుచుకున్నారని చెప్పొచ్చు. తెలుగులోనూ రజినీకాంత్ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది భాషా సినిమా తెలుగులో ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం రీసెంట్ గా జైలర్ సినిమా కూడా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. రజనీకాంత్ వయసు పెరిగిన తన నటనలో ఉన్న పవర్ తగ్గలేదని అభిమానులు మరోసారి చాటి చెప్పారు.

మన తెలుగులో చిరంజీవి గారు మెగాస్టార్ ఆ పేరులో ఎంతో టాలెంట్ కనిపిస్తుంది. డాన్స్ ఫైట్స్ నటన ఇలా ప్రతి దానిలోను తనకంటూ ఒక ప్రత్యేక స్థానం మెగాస్టార్ అవ్వడానికి ఆయన పడ్డ కష్టం కనపడతాయి. మెగాస్టార్ గారు ఎన్నో సంవత్సరం నుండి తెలుగు సినిమా రంగంలో తన ఖ్యాతిని పెంచుకుంటూనే ఉన్నారు. పద్మ విభూషణ్ తో చిరంజీవి గారి స్థాయి మరో మెట్టుకు వెళ్ళింది. ఇక రీసెంట్ గా భోళా శంకర సినిమాతో అలరించారు మెగాస్టార్. 2025 విశ్వంభరా చిత్రానికి రెడీ అవుతున్నారు. రజనీకాంత్ గారు చిరంజీవి గారు ఇద్దరు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు ఇక రజనీకాంత్ దర్శకత్వంలో చిరంజీవి గారు ఒక మూవీలో గెస్ట్ రోల్ ప్లే చేశారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.

మాప్పిళ్ళై 1989 వ సంవత్సరంలో రజనీకాంత్ శ్రీవిద్య అమల హీరో హీరోయిన్స్ గా నటించారు. రాజశేఖర్ దర్శకత్వం వహించారు తమిళంలో ఈ సినిమా మంచి వసూలు సాధించింది. తెలుగులో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే సినిమా రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక తెలుగులో ఈ సినిమా హీరోగా చిరంజీవి గారు నటించారు. తమిళంలో రజినీకాంత్ గారు ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ కోసం చిరంజీవి గారిని సంప్రదించడం జరిగింది.

చిరంజీవి గారు కూడా ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా రజనీకాంత్ కోసం చేస్తానని ఒప్పుకున్నారు ఇక హీరో అయినా రజినీకాంత్ పెళ్లి జరిగే సమయంలో రౌడీలబారి నుంచి కాపాడమని చిరంజీవికి ఫోన్ చేసి చెప్తారు చిరంజీవి రౌడీలను ఫైట్ చేసి పెళ్లి సవ్యంగా అయ్యేలా చూస్తారు ఈ సీన్ మొత్తం రజనీకాంత్ గారి డైరెక్టు చేయడం ఈ సినిమాకు మరో ప్రత్యేకత. ఇప్పటికీ తెలుగు హీరోలు సినిమాలలో తమిళ స్టార్స్ నటించిన తమిళ సినిమాలలో తెలుగు స్టార్స్ నటించిన ఎప్పటినుండో వస్తూ ఉంది. తెలుగు,తమిళం నే కాకుండా భాష ఏదైనా, అందరి హీరోలు పరస్పరం ఇలా సహకరించుకుంటూ సినిమా లు చేయాలని మన మెగాస్టార్ ఆనాడే చెప్పడం విశేషం.

219 views