Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Allu Arjun: అల్లు అర్జున్ కి రామ్ చరణ్ అంటే ఎందుకు అంత కడుపుమంట..?

సరైనోడు విజయోత్సవ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ‘చెప్పను బ్రదర్ ‘ అంటూ అప్పట్లో అల్లు అర్జున్ గారు చేసిన మాటలు తర్వాత రిలీజ్ అయినా ‘దువ్వాడ జగన్నాధం ‘ సినిమా మీద చాల ప్రభావం చూపించాయి , సినిమా టీజర్ ,ట్రైలర్ ల కి కూడా హైయెస్ట్ డిస్ లైక్ లు వచ్చాయి ,సినిమా బావున్నప్పటికీ నెగటివ్ టాక్ ప్రచారం చేసారు. అయితే ఇప్పుడు కూడా దాదాపుగా అలాంటి పరిస్థితి ఏ అనుకోవచ్చు. సినిమా లో ఇద్దరు హీరో లు ఉన్నపుడు ఇద్దరు కూడా సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చినపుడు , ఇద్దరు గ్లోబల్ స్టార్స్ గా అందరి ప్రశంసలు పొందుతున్న సమయం లో ‘అల్లు అర్జున్ ‘ గారి ట్విట్ మెగా ఫాన్స్ కి కోపం తెప్పించింది.

ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రెటీలు మొత్తం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం చాలా లేట్‌గా ఒక్కరోజు తర్వాత ట్వీట్ చేశాడు. ఇది భారత్‌కు చాలా గొప్ప క్షణం.. ఆస్కార్‌ వేదికను ఓ తెలుగు సాంగ్ ఒక ఊపు ఊపినందుకు చాలా గర్వంగా ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, తమ్ముళ్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అలానే గ్లోబల్ స్టార్స్ నా లవ్లీ బ్రదర్ రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లకు శుభాకాంక్షలు. మీ స్టెప్పులతో ప్రపంచాన్నే డ్యాన్స్ చేయించారు. తెలుగు వాళ్ల గర్వం తారక్‌కు నా శుభాకాంక్షలు. ఈ మ్యాజిక్ సాధ్యమయ్యేలా చేసిన ఎస్ ఎస్ రాజమౌళి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. భారత సినిమాకు ఇది హార్ట్ టచింగ్ మూమెంట్.”

ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌ను ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువగా రీట్వీట్ చేస్తున్నారు. తారక్‌ను అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించడంపై ఆనందపడుతున్నారు. కానీ మరోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం కాస్త హర్ట్ అవుతున్నారు. ఎన్‌టీఆర్ గురించి అంత గొప్పగా చెప్పి రామ్‌చరణ్ గురించి మాత్రం చివరిలో బ్రదర్ అంటూ సరిపెట్టాడంటూ బన్నీపై ఫైర్ అవుతున్నారు. మరోవైపు కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నప్పుడు జరిగిన ఓ ఘటనపై కూడా మెగా ఫ్యాన్స్ అలిగారు. కీరవాణి, చంద్రబోస్.. ఆస్కార్ అవార్డు అందుకోవడానికి స్టేజి మీదకు వెళ్లినప్పుడు కీరవాణి వెనుక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ ఫోటో డిస్‌ప్లే అయింది. కానీ రామ్‌చరణ్ ఫొటో కనిపించలేదు. దీంతో రామ్ చరణ్ ఫోటో ఎందుకు లేదు? అంటూ మెగా ఫ్యాన్స్ ఆ వీడియోను వైరల్ చేశారు. కానీ వాస్తవానికి ఆస్కార్ స్టేజి కి నాలుగు వైపులా రాంచరణ్ ,ఎన్టీఆర్ ,హీరోయిన్ ,రాజమౌళి గార్ల ఫొటోస్ కూడా ఉన్నాయి ,కానీ కొంత మంది కావాలనే ఎన్టీఆర్ గారు ఉన్న ఫోటో మాత్రమే చూపిస్తూ సోషల్ మీడియా లో హడావిడి చేసారు.

‘ఆర్ఆర్ఆర్’లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ హీరోలు అయినప్పుడు ఒక్కరి ఫోటో మాత్రమే స్టేజి మీద చూపించడం ఏంటని ఫైర్ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ ఎందకు పట్టించుకోలేదని పోస్టులు పెడుతున్నారు. ఇది సద్దుమణిగిందని అనుకునే లోపు బన్నీ చేసిన ట్వీట్‌తో మళ్లీ వివాదం రాజుకుంది. రామ్‌ చరణ్‌ను తక్కువ చేసేలా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఈ వివాదం ఎలా సైలెంట్ అవుతుందో చూడాలి.

Exit mobile version